I have this blog to sharing anything with people.

20, అక్టోబర్ 2021, బుధవారం

టమాటో తో మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి ఇలా…Face beauty tips at home in telugu

టమాటో తో మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి ఇలా…

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Face glow with tomato

మాటోలో మన చర్మాన్ని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచే లక్షణాలు చాలా ఉన్నాయి. టమోటోలో విటమిన్ ఎ ఉంటుంది. విటమిన్ ఎ చర్మాన్ని చాలా ఆరోగ్యంగా మరియు తేమగా ఉండేటట్లు చేసి చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. అలాగే టమోటోలో విటమిన్ ఈ తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి ముఖంపై పింపుల్స్ రాకుండా చాలావరకు ఉపయోగపడుతుంది ఒకవేళ పింపుల్స్ వచ్చి మానిపోయిన తర్వాత పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ ను తొలగించడానికి కూడా విటమిన్ సి ఉపయోగపడుతుంది. 
అంతే కాకుండా టమోటో లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉండేటట్లు చేస్తాయి.

వీటి కారణంగా మనం టమాటో తో చేసిన ప్యాక్ ను ముఖానికి అప్లై చేసినప్పుడు ఫలితం చాలా తొందరగా వస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Face glow with tomato

ఇప్పుడు మనం టమాటో తో  క్లీనింగ్, స్క్రబ్బింగ్ మరియు ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం.

ముందుగా మనం వీటికి కావలసిన పదార్ధాలు తెలుసుకుందాం:
  1.  శనగపిండి
  2.  శాండల్ పౌడర్
  3. టమాటో గుజ్జు(puree)
  4. పెరుగు
  5. పసుపు
  6. నిమ్మరసం
  7. బియ్యం పిండి
  8. పచ్చి పాలు
ఈ పదార్థాలన్నింటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి.

ముందుగా ఫేస్ క్లీనింగ్ ప్యాక్:

  1. ఒక స్పూన్ టమోటో గుజ్జు
  2. ఒక స్పూన్ పెరుగు
  3. ఒక స్పూన్ నిమ్మరసం
  4. చిటికెడు పసుపు

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Face glow with tomato

వీటన్నిటినీ కలిపి మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.
ఇది పూర్తిగా ఆరిన తర్వాత అంటే పదిహేను నుండి ఇరవై నిమిషాల తర్వాత కాటన్ తో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మన ముఖంపై ఉన్న డస్ట్ మొత్తం తొలగిపోతుంది.  

తరువాత స్క్రబ్బింగ్:

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Face glow with tomato

దీనికోసం
  1. ఒక స్పూన్ టమాటో గుజ్జు
  2. ఒక స్పూన్ బియ్యంపిండి
  3. ఒక స్పూన్ పచ్చిపాలు
  4. చిటికెడు పసుపు
ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసుకొని ఐదు నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత కాటన్ తో శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం పిండికి బదులుగా చక్కెర కానీ లేదా రవ్వ కానీ వాడొచ్చు.
స్క్రబ్బింగ్ వల్ల చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా అవుతుంది. 

చివరగా ప్యాక్:

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Photo by Arina Krasnikova from Pexels

ప్యాక్ కోసం
  1. ఒక స్పూన్ టమాటో గుజ్జు
  2. ఒక స్పూన్ శనగపిండి
ప్యాక్ కి శెనగపిండి చాలా ముఖ్యం
     3. ఒక స్పూన్ పెరుగు
 ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు మిల్క్ వాడొచ్చు
     4. ఒక స్పూన్ గంధం పొడి

ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది బాగా ఎండిన తర్వాత అంటే 20 లేదా 25 నిమిషాల తర్వాత కాటన్ తో ప్యాక్ ని తొలగించి ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతకు ముందు మీ ముఖానికి తరువాత ముఖానికి తేడా మీకే తెలుస్తుంది.

ఇది ముఖానికి మాత్రమే కాకుండా చేతులకు కూడా చేసుకోవచ్చు.
ఇంకా ఇది ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు దీనిలో మనం ఉపయోగించే పదార్థాలన్నీ సాధారణంగా మన ఇంట్లో ఉండేవే కాబట్టి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

గమనిక: మాకు లభించిన మేరకు కొంత సమాచారాన్ని మాత్రమే ఇక్కడ అందిస్తున్నాం. అందానికి సంబంధించి ఏ సమాచారం కావాలన్నా దగ్గర్లోని నిపుణులను సంప్రదించడం మంచిది.
Share:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Recent Posts