I have this blog to sharing anything with people.

This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

30, జనవరి 2021, శనివారం

మనకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని నాశనం చేసే కొన్ని రోజువారీ అలవాట్లు. Some comon habits that can ruin our health.

నకున్న అలవాట్ల(Habits)లో కొన్ని మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కానీ మనకు ఆ విషయం తెలియక ఆ అలవాట్ల(Habits)ను అలానే కంటిన్యూ చేస్తుంటాం. ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లు(Habits) అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మద్యం, సిగరెట్. కానీ ఇవే కాకుండా మనకున్న కొన్ని ఇతర అలవాట్ల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకో బోయే అలవాట్లలో చాలా మటుకు మన అందరికి ఉండేవే. కాబట్టి ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదివి అటువంటి అలవాట్లను మార్చుకోండి. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits
 Some habits that can ruin our health

1) మగవాళ్ళలో చాలామంది తమ పర్స్ ను వెనుక జేబులో పెట్టుకుంటారు. అయితే అలా వెనుక జేబులో పర్సు పెట్టుకొని కూర్చున్నా లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక వైపు ఎత్తుగా ఉండి అది వెన్నెముక మీద భారం పడుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి రావడమే కాకుండా వెన్నుముక దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఈ ప్రపంచంలో చాలా మందికి వచ్చే సయాటికా అనే వెన్నునొప్పి రావడానికి వెనక జేబులో పర్సు పెట్టుకోవడం కూడా ఒక కారణం.
ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే మీరు ఎక్కువ సేపు ఎక్కడైనా కూర్చోవాల్సి వచ్చినప్పుడు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు గానీ మీ పర్స్ నీ వెనుక జేబులో నుండి తీసి ముందు జేబులో పెట్టుకోండి.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits
Some habits that can ruin our health

2) మనలో చాలా మంది చాలా సందర్భాల్లో తుమ్ము వచ్చినప్పుడు ఆపు కొంటాం. అయితే ఇది మనకు చాలా చిన్న విషయంగానే అనిపిస్తుంది. కానీ దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. మనం తుమ్మినపుడు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలి బయటకు వస్తుంది. దీనివల్ల తుమ్ము వచ్చినప్పుడు ఆపితే అది చివుల్లోకి ప్రవేశించి కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తుమ్మును ఆపడం వల్ల ముక్కుకు సంబంధించిన ఎముకలు ఇంకా గొంతు కళ్ళు మెదడు లోని రక్త నాళాలు చిట్లిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే తుమ్ము వచ్చినప్పుడు స్వేచ్ఛగా తుమ్మేయాలి కానీ ఆపుకోకూడదు.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits
Some habits that can ruin our health

3) చాలామంది నిద్రపోయే ముందు లైట్లు ఆర్పేసి చీకట్లో మొబైల్ ఫోన్లు వాడుతుంటారు. దీని వల్ల చాలా ప్రమాదం ఉంది. చీకట్లో మొబైల్ ఫోన్ యూస్ చేయడం వల్ల మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన కంటి రెటీనా మీద ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల కంటి చూపు తగ్గడం, తాత్కాలిక అంధత్వం రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్యూచర్ లో కళ్లద్దాలు వచ్చే అవకాశం తో పాటు ఇలా నిద్రలో ఎక్కువసేపు మొబైల్ వాడడం వల్ల కళ్ల కింద ముడతలు రావడం నిద్రలేమి మొదలైన సమస్యలు వస్తాయి. అసలు నిద్రకు ముందు మొబైల్ వాడడమే మంచిది కాదు. అయితే తప్పనిసరి వాడాల్సి వస్తే గదిలో లైట్లు వేసి ఉంచండి. అలాగే బ్రైట్ నెస్ తగ్గించే నైట్ మోడ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits
Photo by Vincenzo Giove from Pexels

4) మనలో చాలా మంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు అతిగా తినడం కూడా మంచిది కాదు. తినేది ఆరోగ్యకరమైన ఆహారం అయినా కూడా అతిగా తినడం వల్ల శరీరంలో కొవ్వు ఏర్పడి బరువు పెరుగుతారు. అధిక బరువు వల్ల డయాబెటిస్, అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్ లు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనానికి భోజనానికి మధ్య కనీసం ఆరు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి కనీసం ఆరు గంటల సమయం పడుతుంది. అలా కాకుండా మనం తిన్నది అరగక ముందే మళ్లీ మళ్లీ తినడం వల్ల మనం తినే ఆహారం శరీరానికి ఉపయోగ పడకపోగా భారమవుతుంది.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits
Some habits that can ruin our health

5) మనం తినే స్వీట్స్, కూల్డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే శరీరంలోని ప్రతి పార్ట్ మీద దీని ప్రభావం పడుతుంది. చక్కెర ఎక్కువ తినడం వల్ల ఆకలి ఎక్కువ కావడం డయాబెటిస్, బరువు పెరగడం లేదా తగ్గడం, త్వరగా ముసలితనం రావడం, లివర్ ఫెయిల్యూర్, అధిక రక్తపోటు, కిడ్నీ లో రాళ్ళు రావడం, కీళ్లవాతం వంటి ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits
Some habits that can ruin our health

మనం తీసుకునే పంచదార తక్కువ మోతాదులో ఉంటేనే మంచిది. అధిక మోతాదులో తీసుకుంటే దీన్ని మించిన విషం మరొకటి లేదు. ఒక పరిశోధనలో సిగరెట్, మందు ఎంత ప్రమాదకరమో అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది పంచదార అని తేలింది.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits

6) ఈరోజుల్లో లో టైట్ జీన్స్ ధరించడం ఒక ఫ్యాషన్గా మారింది. అయితే ఇలా టైం జీన్స్ ధరించి టైట్ గా బటన్స్ పెట్టుకోవడం వల్ల పొట్ట ఒత్తిడికి గురై తిన్న ఆహారం సరిగా అరగకపోవడం, జీర్ణాశయంలో ఆసిడ్స్ పైకి రిఫ్లెక్ట్ అయ్యి గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కాళ్ళలో రక్తప్రసరణ సరిగ్గా జరగక అక్కడక్కడా రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది అలాగే టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఆడవాళ్ళలో గర్భాశయ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పురుషుల్లో వృషణాలపై ఒత్తిడి పెరిగి స్పెర్ము కౌంట్ తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది.

7) మనలో చాలా మంది కొన్ని సందర్భాలలో మూత్రాన్ని ఆపు కుంటుంటారు. అయితే అప్పుడప్పుడు ఇలా జరిగితే పరవాలేదు కానీ ఎక్కువసేపు మూత్రం ఆపుకోవడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూత్రాశయం నిండినప్పుడు మెదడు వరకు సంకేతాలు పంపుతుంది. కానీ చాలామంది కొన్ని సందర్భాల్లో కుదరక లేదా బద్ధకంతో కొందరు చాలాసేపు మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. అయితే ఇలా మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంది. అక్కడ నుడి ఇన్ఫెక్షన్ కిడ్నీ లోకి వెళ్లి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ ఒక్కోసారి రక్తంలో కూడా కలిసి పోయే అవకాశం ఉంది. అలాగే కే మూత్రాశయ కండరాలు వదులుగ మారి యూరినల్ ప్రాబ్లంస్ వచ్చే అవకాశం ఉంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రంతోపాటు రక్తం కూడా పడే సందర్భాలున్నాయి. అంతేకాకుండా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయం పగిలిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits
Some habits that can ruin our health

8) మనలో చాలా మంది ఉదయం అల్పాహారం తీసుకోరు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు కానీ ఇలా రోజు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల చాలా సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. చాలా మంది ఉదయం సమయం సరిపోక లేదా సన్నబడాలని అల్పాహారం తీసుకోరు అయితే ఉదయంపూట 8:30 లోపుఅల్పాహారం తీసుకోని వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనల తేలినట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉదయం అల్పాహారం తీసుకోని పిల్లల్లో దీనిమీద ఏకాగ్రత లేకపోవడం, మ్యాథ్స్ లో వెనకబడటం, డల్ గా ఉండట వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు పనులన్నీ పూర్తి అయ్యే వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంటారు. దీనివల్ల మెన్సెస్ సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురి కవాల్సి వస్తుంది. కాబట్టి ఉదయం కొద్దిగా అల్పాహారం తీసుకుని తర్వాత మిగతా పనులు చేసుకోవాలి. అలాగే ఉదయం టిఫిన్ చేయని వారిలో మైగ్రేన్ తలనొప్పి, జుట్టు ఊడిపోవడం, డయాబెటిస్, రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున ఉదయం 8:30 లోపు అల్పాహారం తీసుకోవడం మర్చిపోవద్దు.

What are the top 10 bad habits, How do you ruin your health, Why is a bad habit harmful, What are the 5 unhealthy habits, What are the top 10 good habits, What are common bad habits
Photo by Andrea Piacquadio from Pexels 

9) మనలో చాలామందికి రాత్రిపూట బ్రష్ చేసుకునే అలవాటు ఉంటుంది. చాలామంది తిన్న వెంటనే బ్రష్ చేసుకుంటారు. అలా చేయడం సరైనది కాదని డాక్టర్లు చెబుతున్నారు. భోజనం చేసిన తరువాత అరగంట ఆగి బ్రష్ చేసుకోవాలి. వీలైతే ఒక గంట తర్వాత చేస్తే ఇంకా మంచిదని డెంటిస్టులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం మరియు పానీయాలు ముఖ్యంగా ఆమ్లాల తో కూడినవి తీసుకున్నప్పుడు వాటి ప్రభావం పంటిమీద ఉండే ఎనామిల్ పొర పై కొద్దిసేపటి వరకు ఉంటుంది. దీనివల్ల మనం తిన్న వెంటనే బ్రష్ చేసినప్పుడు బ్రష్ యొక్క కదలికలు మరియు రాపిడి వల్ల ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా దంతాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైనా రాత్రి పూట బ్రష్ చేసుకోవాలనుకుంటే తిన్న తర్వాత కనీసం అరగంట వీలైతే ఒక గంట తర్వాత చేసుకోవడం మంచిది.

ఇవి మనలో చాలామందికి ఉండే, మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు(habits). ఈ అలవాట్లను మానుకోకపోతే ప్రమాదమే.
Share:

Recent Posts