I have this blog to sharing anything with people.

12, ఏప్రిల్ 2018, గురువారం

Health benefits of Pomegranate. దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

దానిమ్మ గింజల్ని తినేసి తొక్కను బైట పడేస్తాం. కానీ దానిమ్మ తొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దానిమ్మ తొక్కల్ని బాగా ఎండబెట్టి పొడిచేసి దానిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దానిమ్మ తొక్కలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు కురుపులు మొటిమలకు కారణమైన బాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇక ఈపొడిలో పాలుపోసి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే ముడుతలు గీతలు పోయి  చర్మం బిగుతుగా మారుతుంది. చర్మంపై ఉండే డెడ్ సెల్స్ ని , నలుపుదనాన్ని పోగొట్టే స్కబ్బర్ గా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇదే పొడిని రెండురోజులకొకసారి పెరుగులో కలిపి ముఖానికి రాసుకుని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం పొడిబారడం తగ్గుతుంది.




Share:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Recent Posts