చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు (dandruff). శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. చల్లని గాలులు, జుట్టు తడి ఆరకపోవడం దీనికి కారణాలు. చుండ్రు వల్ల దురద, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇంట్లోనే చిన్నపాటి చర్యలు పాటించడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.
- కొబ్బరి నూనె, నిమ్మరసం: కొబ్బరినూనె జుట్టుకు పోషకాలను అందిస్తుంది. నిమ్మరసం చుండ్రుకు చికిత్స. ఎటువంటి రసాయనాల వాడకం లేకుండా చుండ్రును నివారించవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో అంతే నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో మాడును నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాలాగిిి షాంపూ చేసుకోవాలి.
- మెంతిపిండి ప్యాక్: ఇది చుండ్రుకు సరైన పరిష్కారం. రాత్రి మెంతి గింజలను నీళ్లలో ఈనానబెట్టాలి. ఉదయాన్నేే నీటిని వ్పే మెంతులను గ్రైండ్ చేసి తలకు పట్టించి గంట ఆగి తలస్నానం చేయాలి.
- పెరుగు: తల అంతా పెరుగు పుట్టించడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా, చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెరుగు తలంతా పట్టించి గంట సేపటిి తర్వాత కడగాలి.
- బేకింగ్ సోడా: ముందుగా తలను తడుపు కోవాలి. ఒక స్పూన్ బేకింగ్ సోడాను మాడుకు పట్టించాలి. గంట లేదా గంటన్నర ఉంచి కడిగేయాలి.
- టిట్రీ ఆయిల్: మాడు మీద కొన్ని చుక్కలు ట్రీ ట్రీ ఆయిల్ వేసి తలంతా స్పెండ్ చేయాలి. ఐదు నిమిషాలు ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి.
- యాపిల్ సైడర్ వెనిగర్: ఇది చుండ్రు, జుట్టు రాలేేే సమస్యకు మంచి పరిష్కారం. ఈ సమస్యలకు యాపిల్ సైడర్ వెనిగర్ సరైన పరిష్కారం.నీరు, యాపిల్ సైడర్ వెనిగర్ లను సమపాళ్ళలో తీసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకొని తడి తలపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. బాగా మసాజ్ చేసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి.
- హెన్నా: గోరింట పొడి జుట్టును మృదువుగా ఉంచుతుంది. దీనిలో కలిపే నిమ్మరసం చుండ్రుకు మంచి పరిష్కారం. గోరింటాకుు పొడిలో టిి డికాక్షన్, పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని మిశ్రమాన్ని 8 గంటలు అలాగే పక్కన ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మాడుకు తలకు పట్టించి గంటన్నర తర్వాత కడిగేయాలి.