I have this blog to sharing anything with people.

3, ఫిబ్రవరి 2021, బుధవారం

How many health Benefits of Amla in TeluguII ఉసిరి తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో II

Amla benefits in Telugu, Amla powder benefits, Amla juice benefits, Amla powder for hair, What are the benefits of eating Amla, What happens if you eat Amla daily, What are the side effects of Amla
Health Benefits of Amla

ఉసిరి(Amla) మనకు ఒక వరం లాంటిది. ఇది చలికాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఉసిరి(Amla) తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(health benefits) ఉన్నాయి. ఉసిరి మన శరీరానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. దీనితో పాటు ఉసిరి(Amla)లో మనకు కావలసిన ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉసిరి(Amla)తో పచ్చడి, జ్యూస్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. అలాగే ఉసిరి కాయలు నేరుగా కూడా తినొచ్చు. జలుబు, గొంతు మంట తో బాధపడేవారు రెండు చెంచాల ఉసిరి పొడి, రెండు చెంచాల తేనె కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరిలో ఉండే పీచుపదార్థం మలబద్దకాన్ని నివారిస్తుంది. రోజు ఉదయం పరగడుపున ఉసిరి రసాన్ని పుక్కిలించడం వల్ల నోటిలో ఉండే పుండ్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దగ్గు, ఫ్లూ వంటి వాటికి ఉసిరి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో ఉసిరిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా జీర్ణశక్తి పెరుగుతుంది. ఇంకా ఉసిరి లో ఔషధగుణాలు ఉండటం వల్ల మంచి కండీషనర్ గా కూడా పనిచేస్తుంది. ఉసిరి నూనె జుట్టు తెల్లబడటాన్ని నివారించడమే కాకుండా ఆరోగ్యవంతమైన కేశ సంపదను ఇస్తుంది. కుదుళ్లకు కావలసిన బలాన్నిచ్చి జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడుతుంది. అంతే కాకుండా ఉసిరి ని తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మానికి మంచి మెరుపు కూడా వస్తుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ఉసిరి రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుంది. చెడు టాక్సిన్లను శరీరం నుంచి బయటికి పంపించడానికి ఉసిరి(Amla) రసం బాగా ఉపయోగపడుతుంది. 


Amla benefits in Telugu, Amla powder benefits, Amla juice benefits, Amla powder for hair, What are the benefits of eating Amla, What happens if you eat Amla daily, What are the side effects of Amla
Health Benefits of Amla

తెలుసుకున్నారు కదా ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడుతుందో! అందుకే తరచుగా ఉసిరి(Amla)ని ఆహారంలో తీసుకొని దానిలో ఉండే పోషకాలను శరీరానికి అందించండి. ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(health benefits) పొందండి.




ఇవికూడా చదవండి:


Share:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Recent Posts